సావిత్రిలా ఫోజు పెట్టండి, ప్రైజ్ లతో పాటు కీర్తి సురేష్ ని కలవండి

Updated: May 9, 2018 11:14:53 AM (IST)

Estimated Reading Time: 1 minute, 6 seconds

సావిత్రిలా ఫోజు పెట్టండి, ప్రైజ్ లతో పాటు కీర్తి సురేష్ ని కలవండి

నిజంగా ఇది సూపర్ ఆఫరే...చీరకట్టి, మహానటి సావిత్రిలా ఫోజు పెట్టి ఫ్రైజ్ కొట్టేయచ్చు.  పనిలో పనిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని కలిసేయచ్చు..ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారే ..అలాంటి కంటెస్ట్ అన్నమాట. 

దక్షిణ భారత సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మహానటి సావిత్రి. ఆమె అలవోకగా తిప్పే  కళ్లూ అందమే. మన సంప్రదాయం అనుసరిస్తూ కట్టే చీరా సౌందర్యమే. ఆమె జీవితం ఆధారంగా  ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతూ  సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ మే 9న (ఈరోజు) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో మహిళలకు ఓ సరదా ఫొటో పోటీ లాంటి ఆఫర్ ని ఇస్తున్నారు వస్త్రప్రపంచంలో తమకంటూ ఓ ముద్ర వేసుకుని ముందుకు వెళ్తున్న కెఎఎమ్ ఫ్యాషన్ మాల్ వారు. ఈ సరదా కంటెస్ట్ లో పాల్గొనటం చాలా చాలా ఈజీ.

చీర కట్టుకుని మహానటి సావిత్రిలా ఫోజు పెడుతూ ఓ ఫొటో దిగి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చెయ్యటమే. అయితే ఎక్కడ ఈ ఫొటోని అప్ లోడ్ చెయ్యాలనే కదా మీ సందేహం... ఫేస్ బుక్ లో కెఎల్ ఎమ్ ఫ్యాషన్ మాల్ వారిది కీప్ లవింగ్ మోర్ పేజి ఉంది. అక్కడ ఈ ఫొటోని పోస్ట్ చెయ్యాలి. 

ఇక ఈ కంటెస్ట్ లో గెలిస్తే ఏమిస్తారు అంటారా... 
ఫస్ట్ ఫ్రైజ్ గా 25,000   రూపాయల విలువ చేసే వోచర్స్
ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయల విలువ చేసే వోచర్స్

కామెంట్స్