అద్బుతమైన హస్తకళా వస్త్రాల అమ్మకం..మన హైదరాబాద్ లో

Updated: April 5, 2018 10:46:42 AM (IST)

Estimated Reading Time: 2 minutes, 36 seconds

అద్బుతమైన  హస్తకళా వస్త్రాల అమ్మకం..మన హైదరాబాద్ లో

మన జాతిపిత మహాత్మాగాంధీ  చేతి వృత్తులను అందులో ముఖ్యంగా చేనేతవృత్తిని ప్రోత్సహించాలని పదే పదే చెప్పేవారు. మన చేనేత కార్మికులు ప్రోత్సాహం లేక వెనకబడ్డారేమో కానీ ప్రతిభ విషయంలో ముందే ఉన్నారు. అప్పట్లోనే... బ్రిటిష్ రాణికి అగ్గిపెట్టెలో పట్టినంత చీరను తయారు చేసే సామర్ధ్యం మన చేనేత కార్మకులకు ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. వారి ప్రతిభను మనం గమనించి, గౌరవించి, ప్రోత్సహించాలే కానీ ప్రపంచాన్నే తమ చేనేతతో జయించి,మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి ప్రయత్నమే శ్రీదేవి గొట్టిపాటి గారు చేస్తున్నారు.

\"\" 

డా!! గొట్టిపాటి శ్రీదేవి , ప్రముఖ  శాస్త్రవేత్త మరియు ఫౌండర్ , ఇచ్ఛా వస్త్రా 

నేషనల్ అవార్డ్ విన్నర్ ఇడెం శ్రీనాధ్ రూపొందించిన చేనేత వస్త్రాల ప్రదర్శన,మరియు అమ్మకాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారంటే అవి ఎంత అపురూపమైనవో మనం ఊహించుకోవచ్చు. 

ఎవరీ శ్రీనాథ్..

శ్రమ నీ ఆయుధమైతే విజయం బానిస అవుతుందన్న సామెతకు నిలువెత్తు నిర్వచనం నల్గొండ చేనేత కార్మికుడు శ్రీనాథ్‌. కాలంతో పోటీపడి సాంకేతికత పరుగులు పెడుతున్న క్రమంలో చేతి నిండా పనిలేక... నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లక... కుటుంబ

కామెంట్స్