ఆధునిక సంప్రదాయ ఉత్పత్తి వేదిక.... ఇకత్ మేళ !

Updated: August 18, 2018 05:37:13 PM (IST)

Estimated Reading Time: 3 minutes, 6 seconds

ఆధునిక సంప్రదాయ ఉత్పత్తి వేదిక.... ఇకత్ మేళ !
 ఆధునిక సంప్రదాయ ఉత్పత్తి వేదిక.... ఇకత్ మేళ !
 
అత్యాధునిక సంకేతిక పద్దతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్ లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన "పొచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ 2018" సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్పల్లిలో గల Y.W.C.A హాల్లో కొలువు తీరింది, నటి నిత్య శెట్టి ప్రారంభించారు.
 
 “ఈ మేళ లో ఉంచిన వివిధ రకాల డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయి అని నటి నిత్య శెట్టి అన్నారు, ఈ తరహ ఉత్పత్తుల వలన చేనేత కార్మికులు తమ ఉత్పతులకు మరింత  ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లబిస్తుంది అని ఆమె అన్నారు”.
 
 పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్  డైరెక్టర్లు లవకుమార్ , ఉపేందర్, చైర్మన్  దేవేందర్, సీఈఓ రాజశేఖర్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ మేళాలో వందలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, హోం ఫర్నిషింగ్స్,  డ్రెస్ మెటిరియాల్ అందుబాటులో ఉంచామని వారు వివరించారు . 
 

కామెంట్స్