గుర్తుంచుకోండి: యోగా చెయ్యాలంటే... మీకు ఇవి అత్యవసరం

Updated: February 17, 2018 01:28:21 PM (IST)

Estimated Reading Time: 0 minutes, 42 seconds

ఇటీవలి కాలంలో యువత వారి శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని గొప్ప స్థాయిలో మెరుగుపరచుకోవడానికి మరియు నిర్వహించడానికి దృష్ట్యా తిరిగి ఆవిష్కరింపబడిన మరొక గొప్ప మార్గమే ఈ “యోగ”. యోగా సాధన, కండరాలకు బలాన్ని అందించడానికి, శరీరంకు వశ్యతను జోడించడానికి మరియు మనసుకు విశ్రాంతిని చేకూర్చి మరియు చైతన్యాన్ని కలిగిస్తుందని అందరికీ అర్దమైంది.  గత కొంతకాలంగా యోగాకు మరోసారి ప్రాచుర్యం వచ్చింది. వ్యాయామం అంటే యోగా చేయటమే అన్నట్లుగా అందరూ దీన్ని అనుసస్తున్నారు. సిటీల్లోనే కాదు చిన్న చిన్న టౌన్ ల్లోనూ యోగా సెంటర్లు మొదలయ్యాయి.  మరి యోగాకు ఏ డ్రస్ తో పడితే ఆ డ్రస్ లో చేయలేం కదా అందుకు ప్రత్యేకమైన యోగా ప్యాంట్స్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి.  అలాగే ... ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యూత్ ప్రతీది వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ధరించే వస్త్రాలు, ఫ్యాషన్ యాక్ససరీస్ తదితరాలే కాదు  యోగా డ్రస్ లు సైతం వెరైటీగా ఉండాలని వారు తాపత్రయపడుతున్నారు.  వారి కి తగినట్లుగానూ రూపొందిస్తున్నారు. ఇక్కడ మీరు కొన్ని డిజైన్స్ చూడండి.

కామెంట్స్