అద్బుతమైన హస్తకళా వస్త్రాల అమ్మకం..మన హైదరాబాద్ లో

updated: April 5, 2018 10:46 IST
అద్బుతమైన  హస్తకళా వస్త్రాల అమ్మకం..మన హైదరాబాద్ లో

మన జాతిపిత మహాత్మాగాంధీ  చేతి వృత్తులను అందులో ముఖ్యంగా చేనేతవృత్తిని ప్రోత్సహించాలని పదే పదే చెప్పేవారు. మన చేనేత కార్మికులు ప్రోత్సాహం లేక వెనకబడ్డారేమో కానీ ప్రతిభ విషయంలో ముందే ఉన్నారు. అప్పట్లోనే... బ్రిటిష్ రాణికి అగ్గిపెట్టెలో పట్టినంత చీరను తయారు చేసే సామర్ధ్యం మన చేనేత కార్మకులకు ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. వారి ప్రతిభను మనం గమనించి, గౌరవించి, ప్రోత్సహించాలే కానీ ప్రపంచాన్నే తమ చేనేతతో జయించి,మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి ప్రయత్నమే శ్రీదేవి గొట్టిపాటి గారు చేస్తున్నారు.

 

డా!! గొట్టిపాటి శ్రీదేవి , ప్రముఖ  శాస్త్రవేత్త మరియు ఫౌండర్ , ఇచ్ఛా వస్త్రా 

నేషనల్ అవార్డ్ విన్నర్ ఇడెం శ్రీనాధ్ రూపొందించిన చేనేత వస్త్రాల ప్రదర్శన,మరియు అమ్మకాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారంటే అవి ఎంత అపురూపమైనవో మనం ఊహించుకోవచ్చు. 

ఎవరీ శ్రీనాథ్..

శ్రమ నీ ఆయుధమైతే విజయం బానిస అవుతుందన్న సామెతకు నిలువెత్తు నిర్వచనం నల్గొండ చేనేత కార్మికుడు శ్రీనాథ్‌. కాలంతో పోటీపడి సాంకేతికత పరుగులు పెడుతున్న క్రమంలో చేతి నిండా పనిలేక... నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లక... కుటుంబ పోషణ బరువై బలవంతంగా ప్రాణం తీసుకుంటున్న గడ్డు పరిస్దితుల్లోనూ  ఈయన వెనుకంజ వేయలేదు. తాతల నాటి నుంచి వస్తున్న వృత్తిని నమ్ముకుని , విశ్వ వేదికలపై తన కళా నైపుణ్యాన్ని చాటి, అనేక బహుమతులు గెలుచుకుని రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కుటుంబాలకు భరోసా కల్పించాడు.  ఆయన విజయం ఎందురికో స్పూర్తిని ఇచ్చింది. 

ఈడం శ్రీనాథ్..

 ఆయన గతంలో  కెనడాలో నిర్వహించే చేనేత వస్త్రాల  పోటీకి వెళ్లి విజయపతాకం ఎగరేసారు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది హస్తకళాకారులు పాల్గొన్న పోటీలో శ్రీనాధ్‌ రూపొందించిన డబుల్‌ ఇక్కత్‌ వస్త్రం ప్రధమ స్థానంలో నిలిచింది.  అదే సమయంలో ఇక్కడ జరిగిన జాతీయ హస్తకళల పోటీకి సైతం పాల్గొని విజయంసాధించారు.

అలాగే శ్రీనాధ్‌ రూపొందించిన వస్త్రం  2011 జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. జులై 1న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి చేతుల మీదుగా శ్రీనాధ్‌ జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాడు.  

ఇలాంటి అరుదైన హస్తకళా కార్మికుడు ఉత్పత్తులను ప్రోత్సహిస్తే..మరింతో మందిరి స్పూర్తిగా నిలుస్తుంది. ఆయన డిజైన్ చేసిన ఉత్పత్తలు లభించు చోటు

వేదిక 

సప్తపర్ణి

రోడ్ నెంబర్ 8

బంజారా హిల్స్,హైదరాబాద్

5 ఏప్రియల్, ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 దాకా

 


Tags: srikanth edem, icchha vastra by sridevi, gottipati sreedevi, saptaparni, ikkat, pochampally

comments